sujaya krishna: ఎవరో చెప్పింది చదవడం కాదు... పవన్‌ వాస్తవాలు గ్రహించాలి: మంత్రి సుజయకృష్ణ

  • పవన్‌ ఈ నాలుగేళ్లు ఏం చేశారు?
  • జిల్లాలో మైనింగ్‌ మాఫియా లేదు
  • నిరుద్యోగ భృతిని తప్పు బట్టడం అవివేకం
విజయనగరం జిల్లాలో పర్యటిస్తోన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆ జిల్లాలో మైనింగ్‌, ఇసుక మాఫియాలు ఉన్నాయంటూ చేస్తున్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్‌ మంత్రి సుజనకృష్ణ మండిపడ్డారు. ఈరోజు విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... పవన్‌ కల్యాణ్ ఎవరో చెప్పింది చదవడం మానేసి, వాస్తవాలు గ్రహించాలని అన్నారు.

ప్రత్యేక హోదా కోసం సీఎం చంద్రబాబు నాయుడు పోరాడుతున్నారని, మరి పవన్‌ ఈ నాలుగేళ్లు అందుకోసం ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. విజయనగరంలో మైనింగ్‌, ఇసుక మాఫియాలు లేవని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోసం తమ ప్రభుత్వం ప్రకటించిన భృతిని కూడా పవన్‌ తప్పుపడుతున్నారని, ఇది ఆయన అవివేకమేనని విమర్శించారు.
sujaya krishna
Pawan Kalyan
Jana Sena
Telugudesam

More Telugu News