jc: ప్రాంతీయ పార్టీల్లో వంశపారంపర్య పాలన ఉంటుంది: టీడీపీ ఎంపీ జేసీ

షార్ట్స్‌లో చూడండి
ప్రాంతీయ పార్టీల్లో వంశపారంపర్య పాలన ఉంటుందని, ఇది అన్ని రాష్ట్రాల్లోనూ ఉందని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి అన్నారు. ఇటీవల మహానాడులో ఆయన మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని కావాలని, ఆయన కుమారుడు లోకేశ్‌ ముఖ్యమంత్రి కావాలని అన్న విషయం తెలిసిందే. అలాగే వైసీపీ అధినేత జగన్‌కు ఆయన తాత బుద్ధులే వచ్చాయని కూడా అన్నారు.

ఈరోజు అనంతపురంలో జేసీ మీడియాతో మాట్లాడుతూ, మహానాడులో తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తానెవరినీ తప్పుపట్టలేదని, జగన్‌ కుటుంబాన్ని దూషించలేదని అన్నారు. కాగా, ఏపీలో చంద్రబాబు పాలన అద్భుతంగా ఉందని, ఎండాకాలంలోనే చెరువుల్లో నీరు ఉంటోందని వ్యాఖ్యానించారు.       
Go Back to Shorts
jc
Telugudesam
Jagan
Nara Lokesh

More Telugu News