మోదీని అనుసరిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న కుమారస్వామి
- సమావేశాలకు ఫోన్లు తీసుకురావద్దంటూ అధికారులకు ఆదేశం
- చర్చలకు ఇబ్బంది కలుగుతోందంటూ వ్యాఖ్య
- ఇదివరకే నిషేధం విధించిన మోదీ
తాను ఎప్పుడు సమావేశాలకు పిలిచినా... అధికారులు ఫోన్లను తీసుకురాకూడదని తెలిపారు. సమావేశం ముగిసేంత వరకు ఫోన్లను కోఆర్డినేషన్ అధికారికి అప్పగించాలని చెప్పారు. ప్రధాని మోదీ కూడా ఇలాంటి ఆదేశాలే జారీ చేశారు. తన సమావేశాలకు అధికారులెవరూ ఫోన్లను తీసుకురావద్దని చెప్పారు. మోదీ ఈ నిర్ణయం తీసుకున్న కొన్ని రోజులకే కుమారస్వామి కూడా మొబైల్ ఫోన్లపై నిషేధం విధించడం గమనార్హం.