India: సచిన్ సూపర్ ఫ్యాన్ కు మరువలేని అనుభూతిని మిగిల్చిన ధోనీ!

  • సచిన్ కు వీరాభిమాని సుధీర్ గౌతమ్
  • సుధీర్ ను ఇంటికి ఆహ్వానించి విందు ఇచ్చిన ధోనీ
  • మరువలేని క్షణాలంటూ సుధీర్ ఆనందం
సుధీర్ గౌతమ్... భారత క్రికెట్ అభిమానులందరికీ సుపరిచితుడే. పేరు విని గుర్తించకపోయినా, స్టేడియంలో ఒంటినిండా త్రివర్ణాలను వేసుకుని, సచిన్ టెండూల్కర్ అని రాసుకుని, మ్యాచ్ లకు హాజరై, పెద్ద జెండాను పట్టుకుని తిరుగుతూ ఉంటాడంటే ఎవరైనా గుర్తిస్తారు. సచిన్ కు సుధీర్ వీరాభిమాని. ప్రపంచంలో సచిన్ ఎక్కడ క్రికెట్ అడుతున్నా సుధీర్ ఉండాల్సిందే.

సచిన్ క్రికెట్ నుంచి రిటైర్ అయినా కూడా, సుధీర్ భారత జట్టు ఆడే ఆటలకు వెళ్లి ఆటగాళ్లను ఉత్సాహపరుస్తుంటాడు. ఈ నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోనీ, సుధీర్ కు మరపురాని అనుభూతిని మిగిల్చేలా, తన ఇంటికి పిలిచి విందు ఇచ్చాడు. ధోనీ తనను పిలవడంతో ఎంతో ఆనందపడిన సుధీర్, ఆయనింటికి వెళ్లి ధోనీ, సాక్షిలతో కలసి విందారగించి వచ్చాడు. ఆ క్షణాలను మాటలతో వర్ణించలేనని చెబుతూ, ధోనీ కుటుంబీకులకు కృతజ్ఞతలు చెప్పాడు.
India
Cricket
Sudhir Gautam
Sachin Tendulkar
MS Dhoni

More Telugu News