Jammu And Kashmir: నిరసనకారుల దాడి నుంచి తప్పించుకునేందుకు ముగ్గురిపైకి దూసుకెళ్లిన సైనిక వాహనం... కాశ్మీర్ లో తీవ్ర ఉద్రిక్తత
- శ్రీనగర్ లోని నౌహట్టా ప్రాంతంలో ఘటన
- రాళ్లు, ఇటుకలతో దాడికి దిగిన నిరసనకారులు
- తీవ్రంగా గాయపడిన యువకుడి మృతి
శ్రీనగర్ లోని నౌహట్టా ప్రాంతంలో నిరసనకారులు రాళ్లు, ఇటుకలు విసురుతుంటే, వారి దాడి నుంచి తప్పించుకునే క్రమంలో ఓ సీఆర్పీఎఫ్ వాహనం ముగ్గురి పైకి దూసుకెళ్లడంతో కాశ్మీరు లోయలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన ఓ యువకుడు, చికిత్స పొందుతూ మరణించడంతో నిరసనకారులు పెద్దఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్నారు.
హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శ్రీనగర్ కు రానున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం గమనార్హం. ఈ దాడికి దారి తీసిన పరిస్థితులు ఏంటన్నది తెలియరాలేదని ఓ అధికారి తెలిపారు. కాగా, ఈనెల 29న అమర్ నాథ్ యాత్రకు జరుగుతున్న సన్నాహకాలను పరీక్షించేందుకు రాజ్ నాథ్ కాశ్మీర్ లో పర్యటించనున్నారు. ఇదే సమయంలో ఆయన హురియత్ నేతలతోనూ సమావేశమవుతారని తెలుస్తోంది.