Telangana: ఆవిర్భావ దినోత్సవం: తెలంగాణ అంతటా జిల్ జిల్ జిగేల్... కొన్ని చిత్రాలు!

షార్ట్స్‌లో చూడండి
నేడు తెలంగాణ రాష్ట్ర నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భాగ్యనగరి సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాలు పల్లెలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఎక్కడ చూసినా విద్యుద్దీప కాంతులు, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన వివిధ రకాల ఆకృతులు చూడగానే ఆకర్షించేలా ఉన్నాయి.

హైదరాబాద్ లోని వీధుల్లో చెట్లకు రంగురంగుల విద్యుత్ బల్బులను అలంకరించగా, రాత్రిపూట అవి జిల్ జిల్ జిగేల్ అనిపిస్తున్నాయి. ఇక ఈ లైట్ల వద్ద యువత సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్నారు. హైదరాబాద్, గన్‌ పార్కులోని అమరవీరుల స్తూపం మొదలు, అసెంబ్లీ, రవీంద్రభారతి, అన్ని ఫ్లై ఓవర్లు, ప్రభుత్వ కార్యాలయాలు అందంగా అలంకరించబడ్డాయి. ఇక నేడు పలు ప్రత్యేక కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా జరగనుండగా, పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగే సభకు కేసీఆర్ హాజరుకానున్నారు.
Go Back to Shorts
Telangana
Formation Day
Lighting

More Telugu News