it: బినామీదారుల వివరాలు చెబితే రూ.కోటి ఇస్తాం: ఆదాయ పన్ను శాఖ ప్రకటన

బినామీదారుల వద్ద భారీగా నల్లధనం దాచుకుంటోన్న అవినీతి పరుల భరతం పట్టడానికి కేంద్ర ప్రభుత్వం మరో ఉపాయంతో ముందుకు వచ్చింది. బినామీదారులకు సంబంధించిన కీలక సమాచారం అందిస్తే ఏకంగా రూ.కోటి రూపాయలు ఇస్తామని ఆదాయ పన్ను శాఖ ప్రకటన చేసింది.. దీనికి ‘బినామీ లావాదేవీల సమాచార రివార్డు పథకం 2018’ అని పేరు పెట్టింది. అలాగే, ఆ సమాచారాన్ని ఇచ్చిన వ్యక్తుల వివరాలను తాము బహిర్గతం చెయ్యబోమని, వారికి భద్రత కూడా కల్పిస్తామని తెలిపింది.

బినామీదారుడికి సంబంధించి పూర్తిగా సరైన సమాచారం ఇవ్వాలని పేర్కొంది. బినామీదారుల వివరాలను చెప్పాలనుకునే వారు మొదట ఏదైనా ఆదాయపు పన్ను శాఖ కార్యాలయానికి వెళ్లి ఫామ్‌ను నింపాల్సి ఉంటుంది. సమాచారం ఇచ్చే వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలి. అలాగే బినామీదారుడి వివరాలను అతడు ఎలా తెలుసుకున్నాడన్న విషయాన్ని క్లుప్తంగా ఫామ్‌లో సూచించిన విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. విదేశీయులు కూడా ఈ రివార్డును అందుకోవచ్చు.
it
binami
India

More Telugu News