Pawan Kalyan: అందరూ కలిసి తెలంగాణను సుసంపన్నం చేసుకోవాలి: పవన్‌ కల్యాణ్‌

  • తెలంగాణ రాష్ట్ర నాలుగో ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
  • పోరాటయోధులు తమ ప్రాణాల్ని తృణప్రాయంగా త్యాగం చేశారు
  • తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశారు
కోట్లమంది ఆశయ సాధన ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ట్రం నాలుగో ఆవిర్భావ దినోత్సవ సంబరాలు చేసుకుంటున్న శుభ తరుణంలో తెలంగాణ ప్రజలందరికీ తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. "ఆరున్నర దశాబ్దాల పోరాటంతో సిద్ధించిన ఈ రాష్ట్రం సుసంపన్నం కావాలంటే అందరూ కలసికట్టుగా పని చేయాలి. వందలమంది పోరాటయోధులు తమ ప్రాణాల్ని తృణప్రాయంగా త్యాగం చేసి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశారు.

ఆ వీరుల త్యాగాలను ఎల్లవేళలా గుర్తుచేసుకొంటూ... వారి కలలని సాకారం చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. తెలంగాణ రాష్ట్రం పాడిపంటల్లో.. పరిశ్రమల్లో... ఉపాధి ఉద్యోగ కల్పనలో అభివృద్ధి చెందుతూ ముందుకు వెళుతూ, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తున్నాను" అని ప్రెస్‌నోట్‌ విడుదల చేశారు.
Pawan Kalyan
Jana Sena
Telangana

More Telugu News