ac: ఏసీ బస్ షెల్టర్ వద్ద కారు దిగి.. ప్రయాణికులతో మాట్లాడిన గవర్నర్‌ నరసింహన్‌

షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఏసీ బస్ షెల్టర్లను ఏర్పాటు చేసి ప్రారంభించారు. కాగా, ఖైరతాబాద్‌లోని ఆర్టీవో కార్యాలయం పక్కన ఏర్పాటుచేసిన ఏసీ బస్టాప్‌ వద్ద బస్సు కోసం ఎదురు చూస్తోన్న ప్రయాణికులు.. ఒక్కసారిగా అక్కడికి వచ్చిన గవర్నర్‌ నరసింహన్‌ను చూసి ఆశ్చర్యపోయారు. తన సతీమణితో కలిసి కారులో నుంచి కిందికి దిగిన గవర్నర్‌.. బస్ షెల్టర్‌కు వచ్చి దాన్ని పరిశీలించి ప్రయాణికులతో కాసేపు ముచ్చటించారు. ఇది ఎప్పుడు ప్రారంభించారు? ఎలా ఉంది? అని అడిగి, తెలుసుకుని తిరిగి వెళ్లిపోయారు.
Go Back to Shorts
ac
bus
narasimhan

More Telugu News