krishna: వచ్చే ఎన్నికలలో విజయం సాధించి జగనే ముఖ్యమంత్రి అవుతారు!: సూపర్ స్టార్ కృష్ణ

  • వైఎస్ఆర్ లాగే జగన్ లో పట్టుదల, కష్టపడే తత్వం ఉన్నాయి
  • ప్రజా సంకల్ప యాత్రకి విశేష స్పందన వస్తోంది
  • ఎంపీగా ఉన్నప్పుడే ఇద్దరి కుటుంబాల మధ్య సత్సంబంధాలు
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ వైసీపీ అధినేత జగన్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో చాలా మంది జనాలు వచ్చేవారని, ఇపుడు జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రకి కూడా అంతే స్పందన వస్తోందని కృష్ణ అన్నారు.

 వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాగే జగన్ లో పట్టుదల, కష్టపడే తత్వం ఉన్నాయని, వచ్చే ఎన్నికలలో విజయం సాధించి జగనే ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలోనే తాను ఎంపీగా ఉండటంతో ఇద్దరి కుటుంబాల మధ్య సత్సంబంధాలు ఏర్పడ్డాయని తెలిపారు.
krishna
Mahesh Babu
YSRCP
Jagan
Andhra Pradesh

More Telugu News