Reliance: ప్రీపెయిడ్ వినియోగదారులకు జియో గుడ్‌న్యూస్!

  • హాలీడే హంగామా పేరుతో సరికొత్త ఆఫర్
  • రూ.399 ప్లాన్‌పై రూ.50 క్యాష్ బ్యాక్
  • నేటి నుంచే ప్రారంభం
తన ప్రీపెయిడ్ ఖాతాదారులకు రిలయన్స్ జియో గుడ్‌న్యూస్ చెప్పింది. మోస్టు పాప్యులర్ ప్యాక్ అయిన రూ.399పై రూ.50 క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ‘ఫోన్‌పే’తో ఒప్పందం కుదుర్చుకున్న జియో ‘హాలీడే హంగామా’ పేరుతో సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. మై జియోలోని ఫోన్‌పే ద్వారా రూ.399 ప్యాక్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ.50 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. నేటి నుంచి ఈనెల 15 వరకు మాత్రమే ఆఫర్ అమలులో ఉంటుంది.

రూ.399 ప్యాక్‌లో వినియోగదారులకు 84 రోజుల కాలపరిమితితో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు, 1.5 జీబీ డేటా లభిస్తుంది. కాగా, రూ.399 రీచార్జ్ ప్యాక్‌పై ఇప్పటికే రూ.50 విలువైన డిస్కౌంట్ ఓచర్లు అందిస్తోంది. దీనికి ప్రస్తుతం ప్రకటించిన క్యాష్ బ్యాక్ అదనం. అంటే రూ.399 విలువైన ప్యాక్ వంద రూపాయల రాయితీతో రూ.299కే లభిస్తుందన్నమాట.
Reliance
Jio
Holiday Hungama
Offer

More Telugu News