akhilesh: ఎట్టకేలకు ప్రభుత్వ బంగళాను ఖాళీ చేసిన అఖిలేశ్ యాదవ్!

షార్ట్స్‌లో చూడండి
ఇప్పటికీ ప్రభుత్వ బంగళాలోనే ఉంటోన్న ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్ ఈరోజు ఆ నివాసాన్ని ఖాళీ చేశారు. పలు కారణాలు చూపుతూ మరో రెండేళ్లు తాము అదే బంగళాలో ఉంటామని, అందుకు అవకాశం ఇవ్వాలని  అఖిలేశ్ యాదవ్ సుప్రీంకోర్టుకు విన్నవించుకున్న విషయం తెలిసిందే.

అయితే, ఈ విషయంపై సర్వోన్నత న్యాయస్థానం 15 రోజుల్లోగా ఆ బంగళాను ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించడంతో చేసేదేమీ లేక ఖాళీ చేశారు. మరోవైపు బహుజన్ సమాజ్‌ పార్టీ (బీఎస్‌పీ) అధినేత్రి మాయావతి కూడా నిన్న ప్రభుత్వ భవనాన్ని ఖాళీ చేసి, నూతన భవనానికి వెళ్లారు.                                                                                          
Go Back to Shorts
akhilesh
mulayam
Uttar Pradesh

More Telugu News