notification: తెలంగాణలో పోలీస్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

  • మొత్తం 18,428 పోలీసు ఉద్యోగాలు
  • 1503 ఎస్సై, 16,925 కానిస్టేబుల్ ఉద్యోగాలు
  • వచ్చేనెల 9 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
పోలీసు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తోన్న వారికి తెలంగాణ పోలీస్‌ నియామక సంస్థ తీపి కబురు చెప్పింది. 18,428 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1503 ఎస్సై, 16,925 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఎస్సై ఉద్యోగాలకు విద్యార్హత డిగ్రీ అని ప్రకటించింది. కానిస్టేబుల్ ఉద్యోగానికి ఇంటర్మీడియట్‌ అర్హతగా పేర్కొని, వచ్చేనెల 9 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. హోంగార్డులుగా ఏడాదిపాటు పనిచేసిన వారికి వయోపరిమితి సడలింపు ఇవ్వనుంది. పోలీసు ఉద్యోగాల నియామక ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయనున్నారు.
notification
Police
Telangana

More Telugu News