akhilesh yadab: బీజేపీ నుంచి నేర్చుకున్న ఆటనే.. మేము కూడా ఆడాం: అఖిలేష్ యాదవ్

  • ఉపఎన్నికల్లో బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పారు
  • బీజేపీ కుట్రలకు బ్రేక్ వేశాం
  • బీజేపీ రైతుల ప్రాణాలు తీస్తోంది
దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పారని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. బీజేపీకి ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదని విమర్శించారు. విపక్షాలను చీల్చి గండికొట్టాలన్న బీజేపీ కుట్రలకు బ్రేక్ వేశామని చెప్పారు. బీజేపీ ఆడుతున్న ఆటను, ఆ పార్టీ నుంచే నేర్చుకుని, తాము కూడా ఆడామని తెలిపారు. రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన బీజేపీ... ఇప్పుడు రైతుల ప్రాణాలు తీస్తోందని విమర్శించారు. యూపీలోని కైరానా లోక్ సభ నియోజకవర్గంలో తబుస్సమ్ భారీ మెజార్టీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆర్ఎల్డీ పార్టీకి చెందిన తబుస్సమ్ కు ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు మద్దతు ఇచ్చాయి. 
akhilesh yadab
bjp

More Telugu News