Hyderabad: తెలంగాణ అవతరణ దినోత్సవానికి పరేడ్ గ్రౌండ్ సిద్ధం.. భారీ భద్రత!

  • పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణా అవతరణ దినోత్సవాలు
  • భారీస్థాయిలో కట్టుదిట్టమైన భద్రత
  • పాసులు ఉన్నవారికి మాత్రమే అనుమతి
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన పరేడ్ గ్రౌండ్ లో దాదాపు 2500 మంది పోలీసులు సహా భారీస్థాయిలో ఆక్టోపస్ బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు.

జూన్ 2న ఉదయం 9.30 నుండి 12 గంటలు వరకు జరగనున్న ఈ అవతరణ దినోత్సవ కార్యక్రమానికి పాసులు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామని, నిర్దేశించిన ప్రాంతాల్లోనే వాహనాలు పార్క్ చేసుకోవాలని ఈ సందర్భంగా అంజనీ కుమార్ వివరించారు. కాగా, పరేడ్‌ గ్రౌండ్స్‌లో మొబైల్‌ టాయిలెట్లు, మంచినీటి సరఫరా, నోరూరించే తెలంగాణ స్పెషల్ వంటకాలతో పాటు అంబులెన్స్‌ లు కూడా సిద్ధంగా ఉంచనున్నారు.
Hyderabad
Hyderabad District
Telangana
KCR

More Telugu News