petrol: వరుసగా రెండో రోజు తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

  • లీటర్ పెట్రోల్ పై 7 పైసలు తగ్గింపు
  • 5 పైసలు తగ్గిన డీజిల్ ధర
  • రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం
లీటర్ పెట్రోలు, డీజీల్ పై నిన్న ఒక్క పైసా తగ్గించిన ఆయిల్ కంపెనీలు ఈ రోజు కూడా ధరలను మరింత తగ్గించాయి. లీటర్ పెట్రోల్ పై 7 పైసలు, డీజిల్ పై 5 పైసలు తగ్గించాయి. 16 రోజుల పాటు వరుసగా పెరిగి వాహనదారులకు వణుకు పుట్టించిన ఇంధన ధరలు వరుసగా రెండో రోజు కూడా తగ్గుముఖం పట్టాయి. ఈరోజు తగ్గిన ధరలతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 78.35కు దిగిరాగా, ముంబైలో రూ. 86.16గా ఉంది.

మరోవైపు ఇంధన ధరల విషయంలో నిన్న నాటకీయత చోటు చేసుకుంది. పెట్రోల్ ధర 60 పైసలు తగ్గినట్టు నిన్న ఉదయం ప్రకటన వెలువడింది. ఆ తర్వాత కేవలం ఒక్క పైసా మాత్రమే తగ్గిందంటూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. దీంతో, వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఇంధన ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
petrol
diesel
rates

More Telugu News