Amir Khan: కుమార్తెతో కలసి ఉన్న ఫొటోను పోస్టు చేసిన అమీర్... అసభ్యంగా ఉందని ట్రాల్!

  • ఫేస్ బుక్ లో పోస్టు చేసిన అమీర్
  • ఇలాంటి పోజులేంటని చీవాట్లు 
  • మంచి దుస్తులు వేసుకోవచ్చుగా అని సలహాలు
ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే అమీర్ ఖాన్, తన కుమార్తె ఇరాఖాన్ తో కలిసున్న ఫొటోను పోస్టు చేసి విమర్శలను ఎదుర్కొంటున్నాడు. తన ఫేస్ బుక్ ఖాతాలో వయసొచ్చిన కూతురితో ఆడుకుంటూ దిగిన ఫొటోను ఆయన అభిమానులతో షేర్ చేసుకోగా, ఇది అసభ్యకరంగా ఉందని, ఇలాంటి ఫొటోను పోస్టు చేయకుండా ఉండాల్సిందని నెటిజన్లు అంటున్నారు.

 ఇక ముస్లిం వర్గం నుంచైతే, తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంత కుమార్తె అయినా, అలాంటి పోజులేంటని, రంజాన్ మాసంలో ఇటువంటి ఆటలేమిటని, కనీసం ఇరా ఖాన్ మంచి దుస్తులు ధరించి వుండాల్సిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఓ తండ్రి తన కుమార్తెను ప్రేమించకూడదా? ఇదే ఫొటోలో కొడుకు ఉండివుంటే ఇలాంటి విమర్శలు చేస్తారా? అని ప్రశ్నిస్తున్న వారూ లేకపోలేదు.
Amir Khan
Era Khan
Social Media
Facebook
Trool

More Telugu News