Telugudesam: రాహుల్ గాంధీని ఇంప్రస్ చేయడం కోసం తహతహలాడుతున్న చంద్రబాబు: కన్నా లక్ష్మీనారాయణ

  • టీడీపీ, కాంగ్రెస్ ల మధ్య పొత్తు కుదిరింది
  • అందుకే బీజేపీ నేతలపై చంద్రబాబు విమర్శలు
  • 2019లో పొత్తు లేకుండానే బరిలోకి దిగుతామన్న కన్నా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మెప్పు పొందేందుకు తహతహలాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, ఇప్పటికే తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు కుదిరిపోయిందని తెలుస్తోందని చెప్పారు. రాహుల్ కు దగ్గరయ్యేందుకే నిత్యమూ తమ అధినేతలను ఆయన టార్గెట్ గా చేసుకుని విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు.

 2019 ఎన్నికల్లో తమకు ఇంకో పార్టీతో పొత్తు అవసరమవుతుందని భావించడం లేదని, ఒంటరిగానే బరిలోకి దిగి విజయం సాధించగలమన్న నమ్మకం ఉందని చెప్పారు. ఒక జాతీయ పార్టీకి ఓటు వేస్తే, అభివృద్ధి దిశగా పరుగులు పెట్టవచ్చని ప్రజలు నమ్ముతున్నారని కన్నా అభిప్రాయపడ్డారు. ఏపీకి ఇచ్చిన నిధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని, సమీప భవిష్యత్తులో క్షేత్రస్థాయి పర్యటనలు చేయనున్నానని ఆయన అన్నారు. త్వరలోనే అమిత్ షా రాష్ట్రానికి రానున్నారని అన్నారు.
Telugudesam
BJP
Kanna Lakshminarayana
Chandrababu

More Telugu News