ntr: జూనియర్ ఎన్టీఆర్ కు మోహన్ లాల్ ఫిట్ నెస్ సవాల్!

  • 'హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్' ఛాలెంజ్ విసిరిన మోహన్ లాల్
  • తారక్, సూర్య, పృథ్వీరాజ్ లకు సవాల్
  • ఫిట్ గా ఉండాలంటే వ్యాయామం అవసరమన్న స్టార్ యాక్టర్
జూనియర్ ఎన్టీఆర్, తమిళ స్టార్ హీరో సూర్యలకు బహుభాషానటుడు మోహన్ లాల్ సవాల్ విసిరారు. 'హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్' ఛాలెంజ్ చేశారు. ఈ సందర్భంగా తాను కసరత్తులు చేస్తున్న ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కేంద్ర మంత్రి రాథోడ్ విసిరిన ఛాలెంజ్ ను తాను స్వీకరించానని... తారక్, సూర్య, పృథ్వీరాజ్ లను ఇప్పుడు తాను ఛాలెంజ్ కు ఆహ్వానిస్తున్నానని చెప్పారు. దేశ ప్రజలు ఫిట్ గా ఉండాలంటే వ్యాయామం అవసరమని అన్నారు. మోహన్ లాల్ ఛాలెంజ్ పై ముగ్గురు హీరోలు ఇంకా స్పందించాల్సి ఉంది. 
ntr
suriya
mohan lal
prithviraj
challenge
hum fit toh india fit
fitness challenge

More Telugu News