Uttar Pradesh: బీజేపీ ఖాతా నుంచి జారిపోతున్న మరో ఎంపీ సీటు?... కైరానాలో 13 వేలు దాటిన తబుస్సుమ్ ఆధిక్యం!

  • గోరఖ్ పూర్, ఫుల్ పూర్ ఫలితాలు రిపీట్!
  • కైరానాలో గెలుపు దిశగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి
  • ప్రాంతీయ పార్టీలకు కొత్త ఉత్సాహం!
ఉత్తరప్రదేశ్ లో గోరఖ్ పూర్, ఫుల్ పూర్ ఉప ఎన్నికల ఫలితాలు రిపీట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల తరువాత, ఈ ఉదయం నుంచి కౌంటింగ్ జరుగుతుండగా, దేశవ్యాప్తంగా అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న కైరానా పార్లమెంట్ స్థానంలో ఆర్ఎల్డీ (రాష్ట్రీయ లోక్ దళ్) తరపున బరిలోకి దిగిన అభ్యర్థి తబుస్సుమ్ హనస్, తన సమీప బీజేపీ అభ్యర్థి మ్రిగాంకా సింగ్ కన్నా 13,351 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

 ఇక్కడ కాంగ్రెస్, సమాజ్ వాదీ, బీఎస్పీ తదితర విపక్షాలన్నీ ఒకే మాటపై నిలబడి తబుస్సుమ్ కు మద్దతు పలికిన సంగతి తెలిసిందే. బీజేపీని అడ్డుకోవాలంటే, విపక్షాలన్నీ ఏకం కావాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న వేళ, కైరానా ఫలితం ప్రాంతీయ రాజకీయ పార్టీలకు కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుందని అంచనా.
Uttar Pradesh
Kairana
By-polls
BJP
Congress
SP
BSP
RLD

More Telugu News