Odisha: పదో తరగతి పరీక్షల్లో 97 శాతం మార్కులు తెచ్చుకున్న ఒడియా సినీ హీరోయిన్!

  • మంగళవారం నాడు విడుదలైన సీబీఎస్ఈ ఫలితాలు
  • ఒడియా చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న భూమిక దాస్
  • భువనేశ్వర్ లోని డీఏవీలో చదువుతున్న భూమిక
మంగళవారం నాడు విడుదలైన సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షల ఫలితాల్లో, ఒడిశా సినిమా హీరోయిన్, భూమిక దాస్‌ ఏ1 గ్రేడ్ తో 97 శాతం మార్కులు సాధించి, తాను అందంతో పాటు విద్యలోనూ మేటని నిరూపించింది. భువనేశ్వర్ లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ లో విద్యను అభ్యసిస్తున్న భూమిక, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తనకు మంచి మార్కులు వచ్చాయని చెబుతోంది.

2003 జూన్ 22న జన్మించిన భూమిక దాస్ కు ప్రస్తుతం 15 సంవత్సరాలు నిండాయి. 2014లో బాలనటిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన భూమిక, 'రుంకు జుమానా' చిత్రానికి గాను, ఉత్తమ బాలనటిగా అవార్డును పొందింది. 9వ తరగతి చదువుతున్న సమయంలోనే 'తుమో లవ్‌ స్టోరీ' అనే సినిమాలో హీరోయిన్ గా చాన్స్ కొట్టేసి, ఆపై 'హీరో నెంబర్‌ వన్‌' తదితర చిత్రాల్లో నటించింది.
Odisha
Bhumika dash
Actress
CBSE

More Telugu News