Vizag: విశాఖపట్నం రోడ్లు అద్భుతంగా ఉన్నాయి: రాజమౌళి ట్వీట్

  • చాలా కాలం తరువాత విశాఖ వెళ్లిన రాజమౌళి
  • రోడ్లు పరిశుభ్రంగా ఉన్నాయని ప్రశంస
  • అధికారులకు అభినందనలు
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్, మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్‌తో కలిసి మల్టీస్టారర్ సినిమా రూపొందించే ఏర్పాట్లలో బిజీగా ఉన్న దర్శక ధీరుడు రాజమౌళి విశాఖపట్నానికి వెళ్లారు. అక్కడి రోడ్ల పరిశుభ్రతను చూసి, అధికారుల పనితీరును ప్రశంసిస్తూ ఆయన ట్వీట్ చేశారు. చాలా కాలం తరువాత తనకు విశాఖపట్నం రోడ్లను చూసే అవకాశం వచ్చిందని, చాలా శుభ్రంగా ఉన్నాయని, అలాగే, ఆ పరిసరాల్లో అంతా పచ్చదనం కనపడుతోందని, అధికారులు సమర్థవంతంగా పనులు నిర్వహిస్తున్నారని ట్వీట్ చేశారు. విశాఖ పరిసరాలను అద్భుతంగా తీర్చిదిద్దిన విశాఖపట్నం అర్బన్ డెవలప్‌మెంట్‌ అధికారులకు అభినందనలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.                     
Vizag
Twitter
Rajamouli

More Telugu News