Tollywood: దాసరిని గుర్తు చేసుకుని.. భావోద్వేగంతో ట్వీట్ చేసిన పరుచూరి గోపాలకృష్ణ!

  • ‘దర్శకరత్న’ని గుర్తు చేసుకొంటున్న సినీ పరిశ్రమ
  • దాసరి ఈ లోకాన్ని వదిలి వెళ్లి నేటితో ఏడాది పూర్తి
  • సోషల్ మీడియాలో ట్వీట్ లు చేస్తున్న సినీ ప్రముఖులు
తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా, ‘దర్శకరత్న’గా పేరు సంపాదించున్న దాసరి నారాయణ రావు ఈ లోకాన్ని వదిలి వెళ్లి నేటితో ఏడాది గడిచింది. ఈ సందర్భం గా ఆయనను తలచుకుంటూ పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో ట్వీట్ లు చేస్తున్నారు. తాజాగా ప్రముఖ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ ‘దర్శకరత్న’ని గుర్తు చేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు.

"ఎక్కడికి వెళ్లారు గురువు గారు మీరు?.. చలనచిత్ర పరిశ్రమలోని ప్రతి శాఖలోని ప్రతి వ్యక్తి హృదయంలో ఉన్నారు.. ఉంటారు. మీ అడుగుజాడల్లో నడుస్తూ, మీరు చూపించిన పరిష్కార మార్గాలు అనుసరిస్తూ ఉంటాము.. మీకు జోహార్లు." అంటూ పరుచూరి ట్వీట్ చేశారు.
Tollywood
Hyderabad
Telangana
Andhra Pradesh

More Telugu News