nannapaneni: మహిళల నుంచి పురుషుల రక్షణ కోసం నన్నపనేని కొత్త డిమాండ్!

  • పురుషుల రక్షణ కోసం పురుష కమిషన్ ఏర్పాటు చేయాలి
  • మహిళల్లో నేర ప్రవృత్తికి టీవీ సీరియల్స్ కారణం
  • సమాజానికి ఇది మంచిది కాదు 
ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి ఆసక్తికరమైన డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. మహిళల నుంచి పురుషులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని... దీని కోసం పురుష కమిషన్ ను ఏర్పాటు చేయాలని అన్నారు. ఉత్తరరాంధ్రలో చోటు చేసుకున్న భర్తను చంపిన ఘటనలు, చంపబోయిన ఘటనలు తనను షాక్ కు గురి చేశాయని ఆమె చెప్పారు.

శ్రీకాకుళంలో భార్య చేతిలో దాడికి గురైన వ్యక్తికి అండగా ఉంటామని తెలిపారు. మహిళలపై టీవీ సీరియల్స్ ప్రభావం ఎక్కువగా ఉంటోందని... వారిలో నేర ప్రవృత్తి పెరిగేందుకు సీరియల్స్ దోహదం చేస్తున్నాయని అన్నారు. మహిళల్లో నేరపూరితమైన ఆలోచనలు రావడం సమాజానికి మంచిది కాదని అన్నారు.
nannapaneni
men commission
purusha commission
tv serials
censor

More Telugu News