హైదరాబాద్ లో వదంతులు సృష్టించిన కేసులో ఐదుగురు జర్నలిస్టుల అరెస్ట్!
- 26 తేదీన పిల్లల కిడ్నాపర్లంటూ రాళ్ల దాడి
- ఓ వ్యక్తి ప్రాణాలు బలిగొన్న వదంతులు
- 14 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
హఫీజ్ హోటల్ వద్ద ఓ ముస్లిం మత పెద్ద కల్పించుకుని, రంజాన్ పర్వదినాల్లో హింస కూడదని వారించి ఇద్దరిని రక్షించారని పోలీసులు తెలిపారు. ఇదే సమయంలో డెక్కన్ మెడికల్ హాల్ వద్ద మరో ఇద్దరిని నిరసనకారులు చుట్టుముట్టి రాళ్లతో కొట్టారని, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చంద్రయ్య (52) ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరుసటి రోజు మరణించాడని తెలిపారు. తాము అరెస్ట్ చేసిన 14 మందిలో ఓ మైనర్ బాలుడు కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు.