Treadmill: ట్రెడ్ మిల్ పై ఇలా డ్యాన్స్ చేయొచ్చా... ఇంటర్నెట్ ను ఊపేస్తున్న వీడియో!

  • 10 లక్షలకు పైగా వ్యూస్ తెచ్చుకున్న వీడియో
  • ట్రెడ్ మిల్ పై కిల్లర్ మూమెంట్స్ చేసిన యువతి
  • 'మేరా పంజాబ్' ఫేస్ బుక్ ఖాతాలో వీడియో
ఓ క్రమ పద్ధతిలో తిరుగుతూ ఉండే ట్రెడ్ మిల్ పై వ్యాయామం చేయడమంటేనే కాస్తంత క్లిష్టం. అలవాటు లేక ట్రెడ్ మిల్ పై నుంచి పడి గాయాల పాలైన వారు ఎందరో ఉన్నారు. అటువంటిది ట్రెడ్ మిల్ పై డ్యాన్స్ అంటే... ఓ పంజాబీ సాంగ్ కు అనుగుణంగా ట్రెడ్ మిల్ పై లయబద్ధంగా డ్యాన్స్  చేస్తున్న యువతి వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో సంచలనమైంది.

మిలియన్ కు పైగా వ్యూస్ తెచ్చుకున్న ఈ వీడియోను చూసిన వారంతా, ఆ యువతి చేసిన కిల్లర్ మూమెంట్స్ కు 'వావ్' అనకుండా ఉండలేకపోతున్నారు. 'మేరా పంజాబ్' ఫేస్ బుక్ పేజీలో ఈ వీడియో పోస్ట్ అయింది. ఈ యువతి ట్రెడ్ మిల్ పై డ్యాన్స్ చేసేలా పూర్తి శిక్షణ తీసుకుందని తెలుస్తోంది. ఇటువంటి ప్రయోగాలు సాధారణ ప్రజలు చేస్తే ప్రమాదకరం. ట్రెడ్ మిల్ పై యువతి విన్యాసాల వీడియోను మీరూ చూడవచ్చు.
Treadmill
Dance
Mera Punjab
Viral Videos

More Telugu News