Saif Ali Khan: స్కూలు కెళ్లమంటే నానాయాగీ చేస్తున్న తైమూర్ అలీ ఖాన్... వీడియో వైరల్!

  • తైమూర్ ను స్కూలుకు పంపేందుకు కరీనా విశ్వ ప్రయత్నం
  • గడ్డిలో ఆడుకుంటానంటూ మారాం
  • వీడియో తీసి పోస్టు చేసిన ఓ అభిమాని

బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ల ముద్దుబిడ్డ తైమూర్ అలీ ఖాన్... స్కూలు కెళ్లబోనంటూ మారాం చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిన్నారిని స్కూలుకు తీసుకొచ్చిన వాళ్లమ్మ, లోపలికి పంపించడానికి ప్రయత్నిస్తుండగా, తాను ఆడుకోవడానికి అక్కడే ఉన్న గడ్డిలోకి వెళతానంటూ గోల చేస్తున్నాడు. పక్కనున్న పిల్లలు బుద్ధిగా లోపలికి వెళుతుంటే, తైమూర్ మాత్రం అనాసక్తితో ఉన్నాడు. ఈ బుల్లి నవాబు చేస్తున్న అల్లరి వీడియోను ఓ అభిమాని చిత్రీకరించగా, కరీనా స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో దీన్ని పోస్టు చేసింది. ఈ వీడియోను మీరు కూడా చూడవచ్చు. 


  • Error fetching data: Network response was not ok

More Telugu News