Pawan Kalyan: కుటుంబ సభ్యులని రమ్మని అడగను!: రామ్ చరణ్ వ్యాఖ్యలపై స్పందించిన పవన్ కల్యాణ్‌

  • ఎవరైనా స్వతహాగా వస్తే పార్టీలోకి ఆహ్వానిస్తా
  • అంతేగానీ కుటుంబ సభ్యులను రమ్మని అడగను
  • ఒకటికి 10 సార్లు ఆలోచించుకుని రమ్మని అంటాను
  • రాజకీయాల్లోకి రావాలంటే చాలా నిబద్ధత ఉండాలి
తన బాబాయ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలిస్తే ఆ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని సినీనటుడు రామ్ చరణ్ తేజ్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా పవన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయంపై స్పందించారు. ఎవరైనా స్వతహాగా వస్తే తన పార్టీలోకి ఆహ్వానిస్తానని, అంతేగానీ తన కుటుంబ సభ్యులను రమ్మని అడగబోనని అన్నారు.

అలాగే, ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని రమ్మని అంటానని పవన్‌ కల్యాణ్ పేర్కొన్నారు. రాజకీయాల్లోకి రావాలంటే చాలా నిబద్ధత ఉండాలని, ఇష్టపడి రావాలని అన్నారు. తన కుటుంబ సభ్యులు సంతోషకరమైన జీవితం గడుపుతున్నారని, వారికెందుకు ఇబ్బంది? అని తాను అనుకుంటానని చెప్పారు. అంతకు మించి దీనిపై ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదని అన్నారు.
Pawan Kalyan
Jana Sena
Ramcharan

More Telugu News