jagan: జగన్‌ తో కలసి అడుగేసిన సినీనటుడు పృథ్వీరాజ్

  • భీమవరం సమీపంలోని వీరవాసరం వద్ద పాదయాత్ర
  • వైసీపీ జెండా పట్టుకుని నడిచిన పృథ్వీరాజ్‌
  • వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ 
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తోన్న పాదయాత్రలో సినీనటుడు పృథ్వీరాజ్ పాల్గొన్నారు. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని వీరవాసరం వద్ద జగన్ ను కలిసిన పృథ్వీరాజ్ పలు అంశాలపై మాట్లాడారు. అనంతరం వైసీపీ జెండాను పట్టుకుని, పాదయాత్రలో పాల్గొన్నారు. ఆ పార్టీ తరఫున పృథ్వీరాజ్ గతంలోనూ ప్రచారం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. జగన్ చేస్తోన్న పోరాటం చాలా గొప్పదని పృథ్వీరాజ్ ప్రశంసలు కురిపించారు.
jagan
YSRCP
West Godavari District

More Telugu News