YSRCP: లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌తో వైసీపీ ఎంపీల భేటీ

షార్ట్స్‌లో చూడండి
ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ రాజీనామాలు చేసిన ఐదుగురు వైసీపీ లోక్‌సభ సభ్యులు వాటి ఆమోదం కోసం ఈరోజు ఢిల్లీలో స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కలిశారు. వారితో కాసేపు చర్చించిన సుమిత్రా మహాజన్... రాజీనామాలు చేయడంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
 
సదరు ఎంపీల రాజీనామాల ఆమోదంపై ఆమె నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంతకు ముందు మీడియాతో మాట్లాడిన ఎంపీ వరప్రసాద్..  తాము ఏపీకి ప్రత్యే హోదా కోసమే రాజీనామాలు చేశామని, సీఎం చంద్రబాబు దాన్ని సాధించలేకపోయారని చెప్పుకొచ్చారు. స్వలాభం కోసమే చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని అన్నారు. తాము ఉప ఎన్నికలకు సిద్ధమని ఎంపీ మిథున్‌ రెడ్డి అన్నారు. 
Go Back to Shorts
YSRCP
sumithra mahajan
New Delhi

More Telugu News