Nara Lokesh: రక్తదానం చేసిన ఏపీ మంత్రి నారా లోకేశ్‌

  • మహానాడులో రక్తదాన శిబిరం
  • రక్తదానం చేస్తోన్న వారిని అభినందించిన లోకేశ్‌
  • కొందరు తమపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం
విజయవాడలో జరుగుతోన్న తెలుగుదేశం మహానాడులో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న రక్తదాన శిబిరాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ సందర్శించారు. రక్తదానం చేస్తోన్న కార్యకర్తలను ఆయన అభినందించారు. అనంతరం లోకేశ్ రక్తదానం చేసి మీడియాతో మాట్లాడారు. ఏనాడూ ఆస్తులు ప్రకటించని కొందరు నేతలు తమపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని, ఆమధ్య నంద్యాల ఉప ఎన్నికలోనూ, కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ తామే విజయం సాధించామని లోకేశ్‌ అన్నారు. తమ ప్రభుత్వం ఏపీలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని, అనుకున్న లక్ష్యానికి వాటర్ గ్రిడ్ కూడా పూర్తి చేసిందని తెలిపారు.    
Nara Lokesh
Telugudesam
Andhra Pradesh

More Telugu News