Mahesh Babu: మహేశ్ బాబు 25వ మూవీ టైటిల్ గా 'రాజసం?'

షార్ట్స్‌లో చూడండి
మహేశ్ బాబు తన 25వ సినిమా కోసం సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లలో దర్శకుడు వంశీ పైడిపల్లి బిజీగా వున్నాడు. మహేశ్ బాబు కెరియర్లో సంఖ్యా పరంగా ఈ సినిమా ప్రత్యేకతను సంతరించుకోవడంతో, వంశీ పైడిపల్లి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. మహేశ్ బాబు అభిమానులకి పూర్తిస్థాయిలో సంతృప్తిని కలిగించేలా ఆయన ఈ సినిమా కథను తీర్చిదిద్దాడని అంటున్నారు.

ఈ సినిమా కోసం ఆయన 'రాజసం' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఫిల్మ్ నగర్లో ఈ వార్త జోరుగా షికారు చేస్తోంది గానీ, ఇందులో వాస్తవమెంతో చూడాలి మరి. ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే మంచి హైట్ కావడం వలన తెరపై ఈ జంట కనువిందు చేయడం ఖాయమనేది అభిమానుల మాట.  
Go Back to Shorts
Mahesh Babu
pooja hegde

More Telugu News