'అర్జున్ రెడ్డి' సినిమా షూటింగ్ లో నరకయాతన అనుభవించా: శాలినీపాండే సంచలన వ్యాఖ్యలు
- కాలేజీ సమయంలో రెండు సార్లు ప్రేమలో విఫలం
- అదే సమయంలో 'అర్జున్ రెడ్డి' షూటింగ్
- రొమాంటిక్ సీన్ల షూటింగ్ లో నరకయాతన
ఆ సమయంలో తనకు ఇబ్బందిగా అనిపిస్తూ, నరకయాతనగా ఉండేదని, అంత బాధలోనే షూటింగ్ ను పూర్తి చేశానని చెప్పుకొచ్చింది. తాను సినిమాల్లో అవకాశాల కోసం తల్లిదండ్రులతో గొడవపడి ఇంట్లోంచి బయటకు వచ్చానని చెప్పిన శాలిని, ముంబైలో తాను పడ్డ అద్దె ఇంటి కష్టాలనూ తెలిపింది. ముంబైలో ఒంటరిగా ఉండే వారికి ఇల్లు ఇవ్వరని, తనతో కలసి మరో అమ్మాయి, ఇంకో ఇద్దరు అబ్బాయిలు కలసి ఓ ఇంట్లో అద్దెకున్నామని, వారు తనతో ఎన్నడూ తప్పుగా ప్రవర్తించలేదని తెలిపింది.