Rajdhani Express: షాకింగ్! అర్ధరాత్రి రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్ల వర్షం

  • రైలుపై రాళ్ల వర్షం కురిపించిన దుండగులు
  • పగిలిన కిటికీ అద్దాలు
  • ప్రయాణికులకు గాయాలు
సోమవారం అర్ధరాత్రి సీల్దా-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. రాళ్ల దెబ్బలకు ప్రయాణికులు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురికి ప్రథమ చికిత్స అందించారు. మన్పూర్ జంక్షన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాళ్లు బలంగా వచ్చి తాకడంతో కిటికీ అద్దాలు పగిలి ప్రయాణికులకు గాయాలయ్యాయి. గయ జంక్షన్ వద్ద పగిలిన అద్దాలను మార్చిన అనంతరం రైలు తిరిగి బయలుదేరింది.

సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే దుండగులు పరారయ్యారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించినా చిమ్మ చీకటి కావడంతో వారు తప్పించుకోగలిగారని పోలీసులు తెలిపారు. రాళ్ల దాడికి గల కారణంపై ఆరా తీస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
Rajdhani Express
Gaya Junction
stones

More Telugu News