Tollywood: ‘ఫ్యామిలీ వెడ్డింగ్’ అంటూ ఫొటోలు పోస్ట్ చేసిన ఉపాసన

షార్ట్స్‌లో చూడండి
అక్కినేని కుటుంబంలో కోడలుగా అడుగుపెట్టబోయి మిస్సయిన శ్రియాభూపాల్ గుర్తుండే ఉంటుంది. హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కజిన్ అనిందిత్ తో ఆమె వివాహం జరిగింది. ఫ్రాన్స్ లోని ప్యారిస్ సమీపంలో శ్రియాభూపాల్ - అనిందిత్ వివాహం జరిగినట్టు సమాచారం. ఈ వివాహానికి రామ్ చరణ్ దంపతులు హాజరయ్యారు. ఈ విషయాన్ని ఉపాసన తన ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొన్నారు. ఈ సందర్భంగా అక్కడ దిగిన ఫొటోలను ఉపాసన పోస్ట్ చేసింది. ఈ వివాహం చాలా సింపుల్ గా కొంతమంది కుటుంబసభ్యుల మధ్య జరిగింది.
Go Back to Shorts
Tollywood
Ramcharan
upasana

More Telugu News