Guntur District: కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు అద్దె మైకులా మారారు!: కన్నా లక్ష్మీనారాయణ

  • టీడీపీది మహానాడు కాదు మాయనాడు
  • ఇప్పుడున్నది ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ కాదు
  • చంద్రబాబు అసమర్థత వల్లే ఏపీకి అన్యాయం జరిగింది
నాలుగేళ్ల పాలనలో ఏం చేశారో చెప్పుకోలేని స్థితిలో టీడీపీ ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీది మహానాడు కాదు మాయనాడని, ఇప్పుడున్నది ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ కాదని విమర్శించారు.

చంద్రబాబు అసమర్థత వల్లే ఏపీకి అన్యాయం జరిగిందని, కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు అద్దె మైకులా మారారని వ్యాఖ్యానించారు. అమరావతి రాజధాని రైతులకు చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపించారని, రైతుల భూములను రియల్ ఎస్టేట్ కు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పై చెప్పులేయించిన ఘనత చంద్రబాబుదేనని, ఎన్టీఆర్ మృతికి ఆయనే కారణమని ఆరోపించారు. కర్ణాటకలో బీజేపీకి ఓటువేయొద్దని చంద్రబాబు చెప్పినప్పటికీ, అక్కడ తెలుగు వారి ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో 16 సీట్లు గెలిచామని అన్నారు.
Guntur District
kanna

More Telugu News