sensex: దలాల్ స్ట్రీట్ లో ఉత్సాహం.. ఈ రోజూ లాభాల పంటే!

షార్ట్స్‌లో చూడండి
భారతీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఎనర్జీ, ఫార్మా రంగాలకు చెందిన స్టాకులు లాభాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 241 పాయింట్లు పెరిగి 35,165కి ఎగబాకింది. నిఫ్టీ 84 పాయింట్లు పుంజుకుని 10,689కి చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
జస్ట్ డయల్ (20.03%), క్యాన్ ఫిన్ హోమ్స్ (10.75%), జమ్ము అండ్ కశ్మీర్ బ్యాంక్ (9.34%), ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (8.65%), లక్ష్మి విలాస్ బ్యాంక్ (8.62%).

టాప్ లూజర్స్:
పీసీ జువెలర్స్ (-7.20%), అవంతి ఫీడ్స్ లిమిటెడ్ (-6.78%), ఎన్ఐఐటి టెక్నాలజీస్ (-4.77%), దివీస్ ల్యాబ్ (-4.69%), ఎంఫాసిస్ లిమిటెడ్ (-4.32%).     
Go Back to Shorts
sensex
nifty
stock market

More Telugu News