Chandrababu: రాజకీయాల్లో అత్యంత నీచుడు మోత్కుపల్లి: సండ్ర వెంకటవీరయ్య

  • గవర్నర్ పదవి ఇవ్వకపోవడం వల్లే చంద్రబాబుపై విషం చిమ్ముతున్నారు
  • పార్టీలో ఉంటూనే కేసీఆర్, పవన్, జగన్ ని పొగుడుతున్నాడు 
  • టీడీపీ కార్యకర్తలెవ్వరూ అతన్ని దగ్గరికి రానీయకూడదన్న సండ్ర
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబుపై చేసిన విమర్శల పట్ల టీటీడీపీ నేత సండ్ర వెంకటవీరయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గవర్నర్ పదవి ఇవ్వకపోవడం వల్లే చంద్రబాబుపై మోత్కుపల్లి నర్సింహులు విషం చిమ్ముతూ సంస్కారహీనంగా విమర్శిస్తున్నారని సండ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అప్పట్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ని విమర్శించిన మోత్కుపల్లికి ఇప్పుడాయన దేవుడయ్యాడా?.. పార్టీలో ఉంటూనే కేసీఆర్, పవన్ కల్యాణ్, వైయస్ జగన్ ని పొగుడుతారా? నీ వెనుక ఎవరున్నారో మాకు తెలుసని సండ్ర మండిపడ్డారు. మోత్కుపల్లి లాంటి దుర్మార్గున్ని టీడీపీ కార్యకర్తలెవ్వరూ దగ్గరికి రానీయకూడదని, మనిషిగా ఎప్పుడో ఆయన చచ్చిపోయాడని ఈ సందర్భంగా సండ్ర అన్నారు.
Chandrababu
Jagan
Pawan Kalyan
Telugudesam
KCR
TRS
Jana Sena
Andhra Pradesh
Telangana

More Telugu News