saidharam tej: మళ్లీ ఆ దర్శకుడికే ఛాన్స్ ఇచ్చిన మెగా హీరో!

  • 'తేజ్ ఐ లవ్ యూ' పూర్తి చేసిన మెగాహీరో 
  • కిషోర్ తిరుమలతో నెక్స్ట్ మూవీ 
  • ఆ తరువాత ప్రాజెక్టు గోపీచంద్ మలినేనితో
ప్రేమకథల స్పెషలిస్ట్ గా పేరున్న కరుణాకరన్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ .. 'తేజ్ ఐ లవ్ యూ' సినిమా చేశాడు. రీసెంట్ గా ఈ సినిమా టాకీపార్టును పూర్తిచేసుకుంది. దాంతో కిషోర్ తిరుమలతో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి తేజు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి ఒక సినిమా చేయనున్నట్టు చెబుతున్నారు.

 భగవాన్ - పుల్లారావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. వచ్చేనెలలో ఈ సినిమాను లాంచ్ చేసే ఆలోచనలో వున్నారు. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ లుక్ కొత్తగా ఉంటుందనీ .. ఆయన నటనలో కొత్తకోణాన్ని గోపీచంద్ ఆవిష్కరించనున్నాడని అంటున్నారు. గతంలో 'విన్నర్'తో ప్లాప్ ఇచ్చిన గోపీచంద్ కి సాయిధరమ్ తేజ్ మరో ఛాన్స్ ఇవ్వడం విశేషంగా చెప్పుకుంటున్నారు.  
saidharam tej

More Telugu News