Krish: భయంగా ఉన్నా, నాకు దక్కిన మహాభాగ్యమిది: దర్శకుడు క్రిష్

  • చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ సినిమాలు చూస్తూ పెరిగాను
  • 'ఎన్టీఆర్'కు దర్శకత్వం వహించాలని బాలయ్య కోరితే భయపడ్డా
  • తెలుగుజాతికి ఓ దృశ్యకావ్యాన్ని అందిస్తానన్న క్రిష్
చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ సినిమాలు చూస్తూ పెరిగిన తనకు, ఆయన జీవిత చరిత్రను సినిమాగా తీసే అవకాశం లభిస్తుందని ఎన్నడూ అనుకోలేదని దర్శకుడు క్రిష్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి నివాళులు అర్పించిన క్రిష్, మీడియాతో మాట్లాడారు.

'ఎన్టీఆర్' బయోపిక్ కు దర్శకత్వం చేయాలని బాలయ్య అడిగినప్పుడు భయపడ్డానని, ఆ తరువాత, ఇది తనకు దక్కిన మహాభాగ్యంగా అనిపించిందని అన్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను దృశ్యకావ్యం రూపంలో తెలుగుజాతికి అందించే అవకాశాన్ని తనకు కల్పించిన బాలకృష్ణకు కృతజ్ఞతలని అన్నారు. ఎన్టీఆర్ గొప్ప వ్యక్తని, తనపై ఉంచిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని అన్నారు.
Krish
Balakrishna
NTR
Biopic

More Telugu News