kantharao: 'అనగనగా ఓ రాకుమారుడు'గా తెరపైకి కాంతారావు బయోపిక్

  • జానపద చిత్రాల రారాజుగా కాంతారావు 
  • నిర్మాతగా ఎన్నో ఒడిదుడుకులు 
  • పీసీ ఆదిత్య దర్శకత్వంలో బయోపిక్    
ఒక వైపున ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాలతోను ..మరో వైపున ఏఎన్నార్ సాంఘిక చిత్రాలతోను అదరగొట్టేస్తోన్న కాలంలో, జానపద కథా చిత్రాలతో కాంతారావు తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. పౌరాణిక .. చారిత్రక .. సాంఘిక చిత్రాలలోను ఎన్నో కీలకమైన పాత్రలను పోషించారు. అలాంటి కాంతారావు .. నిర్మాతగా నష్టాలు చవి చూసి ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆయన బయోపిక్ ను రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

దర్శకుడు పీసీ ఆదిత్య కాంతారావు జీవితచరిత్రను తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న ఆయన కాంతారావు సొంత ఊరు అయిన కోదాడ మండలం 'గుడిబండ' వెళ్లి, ఆనాటి ఆయన సన్నిహితుల నుంచి కొన్ని వివరాలను సేకరించారు. కాంతారావు తనయుడు ప్రతాప్ నుంచి కూడా కొన్ని వివరాలను సేకరించాననీ, 'అనగనగా ఓ రాకుమారుడు' పేరుతో కాంతారావు బయోపిక్ ను రూపొందించనున్నానని చెప్పారు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. కృష్ణకుమారి .. రాజశ్రీ .. విఠలాచార్య పాత్రలు కూడా ఈ సినిమాలో వుంటాయనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు.   
kantharao

More Telugu News