కైఫ్ చెప్పాడు... చెన్నై గెలిచింది... ఆ జోస్యం నిజమైంది!

క్రికెటర్ మహమ్మద్ కైఫ్ చెప్పిన జోస్యం నిజమైంది. ఈ ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తుందని ఆయన ముందే చెప్పాడు. అందుకోసం ఓ ఆసక్తికరమైన లెక్కను కూడా తీసుకొచ్చాడు. పాయింట్ల పట్టికలో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు, చివరి స్థానంలో నిలిచిన సంవత్సరంలో, రెండో స్థానంలో ఉన్న జట్టు కప్పును ఎగరేసుకుపోయింది. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ, 2011లో చెన్నై, 2013లో ముంబై, 2014లో కోల్ కతా జట్లు టైటిల్ కొట్టగా, ఆయా సంవత్సరాల్లో ఢిల్లీ చివరి స్థానంలో ఉందని చెప్పాడు.

ఈ లెక్క ప్రకారం 2018లో కప్పు చెన్నై సూపర్ కింగ్స్ ఎగరేసుకు పోతుందని అన్నాడు. ఢిల్లీ జట్టు చివర్లో నిలిచినప్పుడు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు విఫలం అవుతుందన్న విషయం కాకతాళీయమే అయినా, మరోసారి అదే జరగడం గమనార్హం. గత రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ఫైనల్ లో చెన్నై సూపర్ కింగ్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ జట్లు తలపడగా, చెన్నై జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
IPL
Cricket
Chennai Superkings
Delhi Daredevils

More Telugu News