Amit shah: చంద్రబాబు, కేసీఆర్ ల ప్రచారానికి ఓట్లు రాల్తాయా?: ఎద్దేవా చేసిన అమిత్ షా

  • కేసీఆర్, చంద్రబాబు అక్కడ బలమైన నేతలంతే
  • వారు ప్రచారం చేస్తే ఇతర రాష్ట్రాల్లో ఓట్లు రావు
  •  ప్రాంతీయ పార్టీలతో ఫ్రంట్‌లు అసాధ్యం
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావులు వారి రాష్ట్రాల్లో బలమైన నేతలు తప్పితే, వేరే రాష్ట్రాల్లో వారి ప్రభావం అంతగా ఉండదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. ఒడిశాలో చంద్రబాబు, పశ్చిమబెంగాల్‌లో కేసీఆర్ ప్రచారం చేస్తే ఎవరూ ఓట్లు వేయరని ఎద్దేవా చేశారు.

మోదీ నాలుగేళ్ల పాలనలో సాధించిన విజయాలపై ఆదివారం సాయంత్రం ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో షా మాట్లాడారు. ప్రాంతీయ పార్టీలతో ఫ్రంట్‌లు అసాధ్యమని తేల్చి చెప్పారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని మరోమారు స్పష్టం చేశారు. ఇదే సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ ప్రభుత్వ పథకాలు, సాధించిన విజయాలపై 40 నిమిషాల ప్రజెంటేషన్ ఇచ్చారు.
Amit shah
BJP
Chandrababu
KCR

More Telugu News