బాలకృష్ణ గారూ.. మనసా వాచా కర్మణా నిర్వర్తిస్తానని మాటిస్తున్నా: దర్శకుడు క్రిష్

షార్ట్స్‌లో చూడండి
‘ఎన్.టి.ఆర్’ చిత్రానికి దర్శకుడు క్రిష్ ను ఎంపిక చేశామని ప్రముఖ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ కొంచెం సేపటి క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్శకుడు క్రిష్ స్పందించారు. ఈమేరకు ‘ఫేస్ బుక్’ లో ఓ పోస్ట్ చేశారు. ‘నన్ను నమ్మి ఇంత బాధ్యత నాకు అప్పగించిన బాలకృష్ణ గారికి నా కృతజ్ఞతలు. ఇది కేవలం ఒక సినిమా బాధ్యత కాదు. ప్రపంచంలోని తెలుగువాళ్లందరి అభిమానానికి, ఆత్మాభిమానానికి అద్దంపట్టే బాధ్యత. మనసా వాచా కర్మణా నిర్వర్తిస్తానని మాటిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
Go Back to Shorts
Tollywood
NTR
krish

More Telugu News