New Delhi: ఢిల్లీ బయలుదేరిన సీఎం కేసీఆర్

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులతో ఆయన భేటీ కానున్నారు. ఢిల్లీలోనే నాలుగు రోజుల పాటు కేసీఆర్ ఉంటారని సమాచారం. తెలంగాణలో కొత్త జోనల్ వ్యవస్థ నిమిత్తం రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణపై కేంద్రంతో చర్చించనున్నారు. కాగా, కొత్త జోనల్ విధానం, రైతు జీవిత బీమా పథకంను తెలంగాణ మంత్రి వర్గం ఈరోజు ఆమోదించింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మొత్తం15 అంశాలతో అజెండాను రూపొందించారు. 
Go Back to Shorts
New Delhi
cm kcr

More Telugu News