New Delhi: ఢిల్లీ బయలుదేరిన సీఎం కేసీఆర్

  • ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో భేటీ కానున్న కేసీఆర్
  • ఢిల్లీలో నాలుగు రోజులు మకాం వేయనున్న సీఎం
  • కొత్త జోనల్ వ్యవస్థ నిమిత్తం రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణపై చర్చించనున్న వైనం
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులతో ఆయన భేటీ కానున్నారు. ఢిల్లీలోనే నాలుగు రోజుల పాటు కేసీఆర్ ఉంటారని సమాచారం. తెలంగాణలో కొత్త జోనల్ వ్యవస్థ నిమిత్తం రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణపై కేంద్రంతో చర్చించనున్నారు. కాగా, కొత్త జోనల్ విధానం, రైతు జీవిత బీమా పథకంను తెలంగాణ మంత్రి వర్గం ఈరోజు ఆమోదించింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మొత్తం15 అంశాలతో అజెండాను రూపొందించారు. 
New Delhi
cm kcr

More Telugu News