వింటేనే నోరూరిపోతోంది... మహానాడు మెనూ ఏమిటంటే...!
- నేటి నుంచి మూడు రోజుల పాటు మహానాడు
- విజయవాడ వేదికగా సాగనున్న పసుపు పండుగ
- 20కి పైగా వంటకాలు సిద్ధం
ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజా, బందరు లడ్డూ, పూర్ణాలు, పప్పు, దప్పళం, ఉలవచారు, చక్కెర పొంగలి వంటి సంప్రదాయ వంటకాలతో పాటు యాపిల్ హల్వా, వెజ్ జైపూరీ, కడాయి వెజిటబుల్ కుర్మా, పులిహోర, వెజిటబుల్ బిర్యానీ, మునక్కాయ సాంబారు, గుత్తి వంకాయ మసాలా, బంగాళాదుంపల వేపుడు.. ఇలా చెబితేనే నోరూరిపోయే వంటకాలను తెలుగుదేశం పార్టీ నేతలు సిద్ధం చేయించారు. ఇక మహానాడులో పాల్గొనే వారికి అన్ని వేళలా మజ్జిగ ప్యాకెట్లు, మంచినీరు అందుబాటులో ఉంచినట్టు టీడీపీ నేతలు తెలిపారు.