Mahesh Babu: ట్విట్టర్ లో మరికొందర్ని ఫాలో అవుతున్న మహేష్ బాబు!

  • ట్విట్టర్ లో పెరిగిన మహేష్ బాబు ఫాలోవర్ల సంఖ్య
  • కొత్తగా చేరిన రాజమౌళి, టెండూల్కర్, ధోనీ, కోహ్లీ
  • కేటీఆర్, రచయిత టోనీ రాబిన్స్ కూడా
టాలీవుడ్ ప్రిన్స్, టాప్‌ స్టార్స్‌లో ఒకడైన మహేష్ బాబు, తన ట్విట్టర్ ఫాలోయింగ్ ను విస్తరించాడు. మహేష్ బాబు ట్విట్టర్ ఖాతాను నిన్నటివరకూ 65 లక్షల మంది ఫాలో అవుతుండగా, ఆయన మాత్రం తన బావ గల్లా జయదేవ్, దర్శకుడు కొరటాల శివను మాత్రమే ఫాలో అవుతున్నాడన్న సంగతి అందరికీ తెలిసింది.

అయితే, ఇప్పుడు మహేష్ బాబు ఫాలో అవుతున్న వారి సంఖ్య 2 నుంచి 8 కి పెరిగింది. దిగ్గజ దర్శకుడు రాజమౌళి, భారతరత్న సచిన్‌ టెండూల్కర్, ప్రముఖ క్రికెటర్లు మహేంద్ర సింగ్‌ ధోని, విరాట్‌ కోహ్లి, తెలంగాణ మంత్రి కేటీఆర్‌, రచయిత టోనీ రాబిన్స్‌ లను ఆయన ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం కుటుంబంతో కలసి విదేశాల్లో ఎంజాయ్‌ చేస్తున్న ఆయన, వచ్చే నెల 9న తిరిగి హైదరాబాద్ రానున్నారు. ఆ తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కొత్త సినిమా షూటింగ్ మొదలవుతుంది.
Mahesh Babu
Twitter
KTR
Rajamouli
Sachin Tendulkar
Virat Kohli
MS Dhoni

More Telugu News