Yanamala: అమిత్‌ షా, మోదీ రాజకీయాల్లోకి రానప్పుడే చంద్రబాబు నేషనల్‌ ఫ్రంట్‌ స్థాపించారు: యనమల

  • కాంగ్రెస్‌ పార్టీతో మా పార్టీ ఎప్పటికీ కలవదు
  • మా పార్టీ కేంద్రంలో వాజ్‌పేయి ప్రభుత్వానికి అండగా ఉంది
  • ఆ విషయాన్ని అమిత్‌ షా గుర్తుంచుకోవాలి
కాంగ్రెస్‌ పార్టీతో తమ పార్టీ ఎప్పటికీ కలవదని టీడీపీ నేత, ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... గతంలో తమ పార్టీ కేంద్రంలో వాజ్‌పేయి ప్రభుత్వానికి అండగా ఉన్న సంగతిని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా గుర్తుంచుకోవాలని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలిసిపోయారని అమిత్‌ షా అన్నారని, ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని యనమల అన్నారు.

ఏపీ ప్రయోజనాల కోసం 2014లో ఎన్డీఏతో తాము కలిశామని, కానీ కేంద్ర సర్కారు రాష్ట్రానికి నాలుగేళ్లుగా ఏమీ చేయకపోవడంతో పోరాటం చేయాలన్న ఉద్దేశంతోనే బయటకు వచ్చామని యనమల వ్యాఖ్యానించారు. అమిత్‌ షా, ప్రధాని మోదీ రాజకీయాల్లోకి రానప్పుడే చంద్రబాబు నేషనల్‌ ఫ్రంట్‌ స్థాపించారని ఉద్ఘాటించారు.
Yanamala
Andhra Pradesh
Telugudesam
Narendra Modi

More Telugu News