nakka: దమ్ముంటే బీజేపీ, వైసీపీ కలిసి పోటీ చేస్తామని చెప్పాలి: మంత్రి ఆనందబాబు

  • జగన్‌తో కలిసి బీజేపీ కుట్రలు
  • నాలుగేళ్లు కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా అభివృద్ధి
  • దేశ వ్యాప్తంగా మోదీ మేనియా తగ్గుతోంది
నమ్మకమైన మిత్రుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని బీజేపీ అనవసరంగా దూరం చేసుకుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుగుబాటుతో దేశ వ్యాప్తంగా మోదీ మేనియా తగ్గుతోందని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. గుంటూరులోని తెనాలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... అవినీతి కేసుల్లో ఉన్న వైసీపీ అధినేత జగన్‌తో కలిసి ఏపీలో బీజేపీ కుట్రలు పన్నుతోందని తెలిపారు.

నాలుగేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా చంద్రబాబు నాయుడు ఏపీని అభివృద్ధి పథంలో నడిపించారని నక్కా ఆనందబాబు అన్నారు. లాలూచీ రాజకీయాలు మానేసి దమ్ముంటే బీజేపీ, వైసీపీ కలిసి పోటీ చేస్తామని చెప్పాలని సవాలు విసిరారు. బీజేపీ వల్లే జగన్‌ కేసులు ముందుకు వెళ్లడం లేదని ఆరోపించారు.      
nakka
Andhra Pradesh
BJP
Narendra Modi
Jagan

More Telugu News